మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత (లేఆఫ్స్)ను ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నలు పలు టీమ్‌లకు చెందినవారిని తొలగిస్తున్నట్టు తెలిసింది. అయితే ఎంతమందిని ఉద్యోగం నుంచి తొలగించిందో వెల్లడిరచలేదు. ఉద్యోగం పోయిన పలువురు లింక్డిన్ వేదికగా పోస్టులు పెడుతుండటాన్ని బట్టి చూస్తే ప్రోడక్ట్, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ విభాగాల్లో తొలగింపులు చోటు చేసుకున్నట్టు తెలుస్తున్నది. గత ఏడాదిలో 2.32 లక్షల నుంచి 2.27 లక్షలకు తగ్గింది. ఈ ఏడాది జనవరిలో గేమింగ్ డివిజన్‌లో 2 వేల మందిని విధుల నుంచి తొలగించింది. అజ్యూర్, మిక్స్‌డ్ రియాలిటీ విభాగంలో వెయ్యి మందిని ఇంటికి పంపింది. తాజాగా చేపట్టిన తొలగింపుల ప్రక్రియ అందుకు అదనం. ఈ ఏడాది ఇండస్ట్రీలో దాదాపు 1 లక్ష మంది ఉద్యోగులకు పలు టెక్ కంపెనీలు లే ఆఫ్‌లు ప్రకటించినట్టు తెలిసింది.