Microblogging :ఎక్స్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా సేవలకు అంతరాయం

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ (Microblogging) సైట్ ఎక్స్ ( గతంలో ట్విటర్) సేవలకు కాసేపు అంతరాయం ఏర్పడిరది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం ఈ సమస్య తలెత్తింది. ఎక్స్ ఖాతాలను తెరవగానే ఖాళీ పేజీ దర్శనమిస్తోందని పలువురు యూజర్లు ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా ఫిర్యాదులు చేశారు. భారత్(India )లో దాదాపు 2 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా (America )లో 18 వేల మంది, యూకే (UK) లో 10 వేల మంది ఎక్స్ సేవలు రావట్లేదని ఫిర్యాదులు చేశారు. అమెరికాలో దాదాపు 67 శాతం మందికి ఈ సమస్య ఎదురైనట్లు సమాచారం. దీనిపై కంపెనీ స్పందించలేదు. సిబ్బంది కొరత, ఇతర సాంకేతిక కారణాల వల్ల తరచూ ఆ మధ్య ఎక్స్ సేవలు తరచూ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎక్స్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.