డిజిటల్ ఇన్‌క్లూజన్ కోసం రూ.2 కోట్ల విలువైన 2500 స్మార్ట్ ఫోన్లను అందించే ప్రతిజ్ఞ చేసిన ఎంఐ (Mi) ఇండియా
* టీచ్ ఫర్ ఇండియా ద్వారా ఈ స్మార్ట్ ఫోన్లను భారతదేశ వ్యాప్తంగా మహమ్మారిబారిన పడిన వర్గాలకు అందుబాటులోకి తీసుకు రానుంది.
*ఎంఐ (Mi)ఇండియా తన ప్రత్యేక రిటెయిల్ నెట్వర్కు సహకారంతో ఈ సదుద్దేశం కోసం 2500+ స్మార్ట్ ఫోన్లను విరాళంగా అందిస్తోంది.
భారతదేశం తన 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఎంఐ (Mi) ఇండియా తన పంపిణీదారులు, రిటెయిల్ భాగస్వాముల నెట్వర్కు సహకారంతో మహమ్మారి బారిన పడిన సముదాయాల్లోని బాలలకు రూ.2 కోట్ల విలువైన 2500 సరికొత్త స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. ఈ చక్కని ఉద్దేశానికి మద్దతుగా సంస్థకు చెందిన 2500+ దృఢమైన ప్రత్యేక రిటెయిల్ నెట్వర్కు ప్రతినిధులు 2500+ స్మార్ట్ ఫోన్లను విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారు.
సమాజానికి తమ వంతు బాధ్యతగా తోడ్పాటు అందిస్తూ ముందడుగు వేయడంలో ఎంఐకు చెందిన రిటెయిల్ & పంపిణీ విభాగం భాగస్వాములు ఇప్పటికే నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలకు ఇది కొనసాగింపు. ఇటీవల ఎంఐ భాగస్వాములు కొవిడ్ లాక్‌డౌన్‌తో ప్రభావితమైన 2 లక్షల కుటుంబాలకు పలు రకాలుగా సహాయం చేశారు. అంఫన్ తుపాను ప్రభావానికి గురైన 10,000 కుటుంబాలకు మద్దతుగా నిలిచి వారికి కావలసిన సహాయంయాన్ని అందజేశారు.
ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా పేద కుటుంబాలకు చెందిన బాలలు ఆన్లైన్లో విద్యాభ్యాసం చేసేందుకు అనువుగా ఎంఐ ఇండియా ఇప్పటికే టీచ్ ఫర్ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. లాక్‌డౌన్‌తో పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్లో బోధన ప్రారంభించగా, పేదరికం కారణంగా వేలాది మంది విద్యార్థులు ఇప్పటికీ తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. ఈ బ్రాండ్-న్యూ ఎంఐ స్మార్ట్ ఫోన్లను బాలలు ఆన్లైన్లో తరగతులకు హాజరయ్యేందుకు వినియోగించుకునేందుకు ఈ భాగస్వామ్యం సహకరిస్తూ, వారు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించుకునేందుకు మద్దతుగా నిలుస్తుంది.
ఈ భాగస్వామ్యం గురించి ఎంఐ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణన్.బి మాట్లాడుతూ “ఎంఐ ఇండియా ద్వారా ప్రతి భారతీయునికీ అత్యుత్తమ సాంకేతికతను అందుబాటులోకి తీసుకు రావాలని మేము కోరుకుంటున్నాము. ఇందులో భాగంగానే 2500+ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఎంఐ ఇండియాతో కలిసి వచ్చిన మా రిటెయిల్ భాగస్వాములకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకు రావాలన్న కారణంతోనే మేము కలిసి కట్టుగా పని చేస్తున్నామని’’ పేర్కొన్నారు.
టీచ్ ఫర్ ఇండియా సిటీ ఆపరేషన్స్ చీఫ్ సందీప్ రాయ్ మాట్లాడుతూ, ‘‘దేశంలో నైతిక మరియు సామాజిక చట్రాలను మహమ్మారి చిన్నాభిన్నం చేసింది. విద్యా బోధనకు సంబంధించిన అన్ని అంశాలు తక్కువ వనరుల విభాగానికి మారిపోయాయి. బ్లెండెడ్ లెర్నింగ్ పేరిట అందుబాటులోకి తీసుకు వచ్చిన ఒక నూతన విధానాన్ని టీచ్ ఫర్ ఇండియా అనుసరిస్తుండగా, ఇది భారతదేశ వ్యాప్తంగా బాలలు తాము నేర్చుకునే విధానాల్లో మార్పును తీసుకు వచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎంఐతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదర్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది మరియు విద్య కోసం సరైన ఉపకరణాలను అందుకునేందుకు, ఈ విద్యార్థులను మరింత శక్తివంతులుగా మార్చేందుకు ముందుకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలని’’ పేర్కొన్నారు.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ఎంఐ 5వ ఏడు నిర్వహించుకుంటుండగా, ఈ క్యాంపెయిన్‌లో భాగంగా భారతదేశం పట్ల బ్రాండ్ తనకున్న నిబద్ధతను మరింత బలోపేతం చేస్తోంది.
లాంచ్ వీడియోను వీక్షించేందుకు ఎంఐ ఇండియా యూట్యూబ్ ఛానెల్‌ను సందర్శించండి-(https://www.youtube.com/channel/UCSZ55Hjl_1sZZG04Puf_SrA)






