ఇక ఫేస్ బుక్ మెసెంజర్ లో.. ఎండ్ టు ఎండ్
ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్లో సందేశాలు, కాల్స్‌కు ఇకపై ఎండ్-టు ఎండ్ ఎన్క్రిప్షన్ను తప్పనిసరి (డిఫాల్ట్) చేస్తున్నట్లు దాని మృతసంస్థ మెటా ప్రకటించింది. హ్యాకర్లు, ఇతర నేరగాళ్ల నుంచి వినియోగదారులకు ఇది రక్షణ కల్పిస్తుందని తెలిపింది. ఎండ్-టు ఎండ్ ఎన్క్రిప్షన్ అందుబాటులోకి వస్తే, సెండర్, రిసిపియెంట్ మినహా మరెవరూ సందేశాలను చదవలేరు. మెటాకు కూడా వాటిని అర్థం చేసుకోవడం వీలుకాదు. ఫేస్బుక్ మెసెంజర్లో 2016లోనే ఎన్క్రిప్టెడ్ చాట్లను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ అప్పటికి అది ఐచ్ఛికం మాత్రమే కావడం గమనార్హం.






