మెటా లో ఉద్యోగులకు షాక్.. 11 వేల మందిని
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. మెటా మొత్తం సిబ్బంది సంఖ్యలో ఇది 13 శాతం. ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఈ విషయాలు వెల్లడించారు. కొవిడ్ తర్వాత కూడా భారీ వృద్ధి ఉంటుందనే అంచనాతో పెద్ద యొత్తున ఉద్యోగులను తీసుకున్నాం. దురదృష్టవశాత్తు నేను ఊహించిన విధంగా జరగలేదు. ఆన్లైన్ కామర్స్ మళ్లీ పాత స్థాయికి వచ్చేసింది. స్థూల ఆర్థిక మందగమనం, పెరిగిన పోటీ, ప్రకటనలు తగ్గడం వంటి కారణాలతో ఆదాయాలు నేను ఊహించిన దానికన్నా తగ్గాయి. నేను పరిస్థితిని తప్పుగా అంచనా వేశాను. దీనికి బాధ్యుణ్ణి నేనే అని ఆయన పేర్కొన్నారు. తీసివేస్తున్న ఉద్యోగులకు ఈమెయిల్స్ వస్తాయని, వారికి కంపెనీ సిస్టమ్స్ ఇక అందుబాటులో ఉండవని జుకర్బర్గ్ తెలిపారు.






