మెటా మరో షాక్.. ఉద్యోగులకు ఉద్వాసన
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మాతృ సంస్థ మెటా ఉద్యోగులకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలిసింది. నాన్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ తొలగింపులు ఉంటాయని సూచించింది. గత నవంబర్‌లో 11 వేల మంది ఉద్యోగులను (మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 13 శాతం ) మెటా తొలగించింది. ఇప్పుడు మరింత మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. తాజా తొలగింపులకు కూడా ఆర్థిక అనిశ్చితి, ఆదాయం తగ్గడం వంటి కారణాలను సాకుగా చూపుతోంది. అయితే ఈ కోతలు ఒకేసారి కాకుండా క్రమంగా ఉంటాయని అంచనా వేసింది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వేలాది మందికి కంపెనీ సబ్‌పార్ రేటింగులు ఇచ్చింది. వాటి ఆధారంగానే తొలగింపులు ఉంటాయని భావిస్తున్నారు.






