మహీంద్రా మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన ..
దేశీయ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా వందలమంది ఎగ్జిక్యూటివ్‌లకు భారీ షాక్ ఇచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ మూడు వందలమంది మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన పలికింది. ముఖ్యంగా మహీంద్రా మొబిలిటీ సర్వీసెస్ అధ్యక్షుడు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యులు వీఎస్ పార్థసారధి సహా పలువురు సీనియర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు ఇందులో ఉన్నారు. మహీంద్రా వ్యాపార ప్రణాళిక విభాగాధిపతి ప్రహ్లాద రావు, ఇతర సీనియర్ స్థాయి అధికారులు కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఎంఅండ్ఎం అధికారిక ధృవీకరణ ఏదీ ప్రస్తుతానికి లేదు. వాహనాల విక్రయాల్లో క్షీణత నేపథ్యంలో మహీంద్రా ఈ నిర్ణయం తీసుకుంది.






