కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగించే ప్రకటన చేసింది. ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానానికి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో గడువును పొడిగించాలని పన్ను చెల్లింపుదారుల నుంచి విజ్ఞప్తులు అందాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. పాన్, ఆధార్ అనుసంధానికి మరింత గడువు లభించింది. పాన్ కార్డుతో ఆధార్ లింక్‌కు మార్చి 31 వరకు గడువు విధించింది. అయితే చివరి రోజు పాన్, ఆధార్ లింక్ కోసం చాలా మంది ప్రయత్నించారు. దీంతో ఐటీ శాఖ వైబ్‌సైట్ క్రాష్ అయ్యింది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుసంధాన గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గతేడాది ఆగస్టు వరకు 32.71 కోట్ల పాన్లు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి.






