ఫోర్బస్ జాబితాలో కావేరీ సీడ్స్
ప్రస్తుత సంవత్సరానికి గాను ఫోర్బస్ మాగ్యజైన్ రూపొందించిన ఆసియస్ బెస్ట్ అండర్ బిలియన్ జాబితాలో కావేరీ సీడ్స్‌కు చోటు లభించింది. ఈ జాబితాలో ఆ సంస్థకు చోటు లభించడం గత పదేండ్లలో ఇది ఆరోసారి. బిలియన్ డాలర్ల లోపు ఆదాయం కలిగిన, స్థిరమైన వృద్ధిని సాధిస్తున్న 200 ఆసియా-పసిఫిక్ పబ్లిక్ కంపెనీలతో ఈ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్ జీవీ భాస్కర్‌రావు మాట్లాడుతూ మెరుగైన హైబ్రిడ్స్, ఆర్అండ్డీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో విజయం సాధించడం వల్లనే ఈ ప్రతిష్ఠాత్మకమైన గుర్తింపు లభించిందన్నారు.






