అమెజాన్ సీఈఓ పదవికి జెఫ్ బెజోస్.. గుడ్ బై

అమెజాన్ కంపెనీ సీఈఓ జెఫ్ బోజెస్ పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. జూలై 5న అధికారికంగా ఈ పదవిని వీడనున్నారు. సంస్థను స్థాపించిన 27 ఏండ్లకు సీఈఓ పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకుంటున్నారు. జెఫ్ బెజోస్ ఇంటర్నెట్‍తో పుస్తకాలను విక్రయించడం ద్వారా అమెజాన్ సంస్థను జెఫ్ బెజోస్ 27 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సంస్థను ప్రపంచంలోనే మేటి సంస్థగా తీర్చిదిద్దారు. కంపెనీ సీఈఓ పదవిని వీడుతున్నట్లు జెఫ్ బేజోస్ తీవ్ర ఉద్వేగం మధ్య ఇటీవల ప్రకటించారు. సంస్థ కొత్త సీఈఓగా తన ఆర్థిక సలహాదారుగా ఉన్న ఆండీ జెస్సీని నియమించారు. ఆండీ జెస్సీ జులై 5న సీఈఓ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, బెజోస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‍గా కొనసాగుతారు.