బెర్నార్డ్ అర్నాల్ట్ కు షాక్…. ప్రపంచ కుబేరుడిగా

ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం ఎల్‍ఎంవీహెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మరోసారి నిలిచారు. కంపెనీ షేర్లు ఎగబాకడంతో అర్నాల్ట్ 186.4 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ (186 బిలిన్ డాలర్లు)ను వెనక్కి నెట్టి ఫోర్బస్ బిలియనీర్ల జాబితాలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించారు. జెఫ్ బెజోస్ సంపద మంగళవారం ఏకంగా 313 మిలియన్ డాలర్లు పెరగడంతో 189.2 బిలియన్ డాలర్ల సంపదతో బెజోస్ అర్నాల్ట్ను (189.1 బిలియన్ డాలర్లు) అధిగమించి తిరిగి ప్రపంచ కుబేరుడిగా నెంబర్ వన్ స్థానాన్ని తిరిగి అందుకున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ 147.3 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో కొనసాగారు. గత ఐదేండ్లుగా బెజోస్ నికర సంపద సగటున 34 శాతం పెరుగుతుండటం విశేషం. అర్నాల్ట్ ముచ్చట కేవలం ఒక రోజులోనే ముగిసింది.