US Federal :ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం

తాజా పాలసీ సమీక్షలో యూఎస్ ఫెడరల్ (US Federal) రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు మరోసారి 4.25 -4.5 శాతం వద్దే కొనసాగనున్నాయి. చైర్మన్ జెరోమీ పావెల్ (Jerome Powell ) అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) గత సమీక్షలోనూ యథాతథ పాలసీ అమలుకే ఓటు వేసిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలపై ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌ల విధింపు, వీటి కారణంగా యూఎస్‌లో స్టాగ్‌ఫ్లేషన్ పరిస్థితులు తలెత్తనున్నట్లు ఆర్థికవేత్తల అంచనాల నడుమ ఎఫ్‌వోఎంసీ (FOMC) ఆచితూచి అడుగేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఫెడ్ నిర్ణయాల తదుపరి చైర్మన్ పావెల్ (Pavel) ప్రసంగంపై ప్రపంచ కేంద్ర బ్యాంకులు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. అయితే ఆర్థికవేత్తలు ఊహిస్తున్నట్లు 2023లో వడ్డీ రేట్ల కోతలపై ఫెడ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడకపోవచ్చని అభిప్రాయపడ్డారు.