భారత్‌కు వస్తోన్న అమెరికా దిగ్గజ కంపెనీ ఇంటెల్!
అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ భారత్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిప్ సెట్ మేకర్ ఇంటెల్ భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమాన్ని బతోపేతం చేస్తూ సెమీకండర్టర్స్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు తయారీని కూడా పెంచే సెమీకండర్టర్లపై ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎస్ అథారిత చిప్ సెట్ దిగ్గజం ఒక ప్రకటనను చేసింది. దేశీయంగా సెమీకండర్టర్ పరిశ్రమ విస్తరణకు, దిగుమతులను తగ్గించి స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఇంటెల్ సమీనియర్ వైస్ ప్రెసిడెంట్ రణధీర్ ఠాకూర్ ట్విట్టర్లో అభినందించారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీకి భారత్ ప్రోత్సాహకాలు ప్రకటించడం, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా చేయాలని నిర్ణయం తీసుకున్నందున భారత ప్రభుత్వానికి, అశ్విని వైష్టవ్‌కు అభినందనలు. సరఫరా చైన్‌లో భాగమైన నైపుణ్యం, డిజైన్, తయారీ టెస్ట్, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ ఇలా అన్ని అంశాల కలయికల ప్రణాళికలు చూసి సంతోషిస్తున్నామని రణధీర్ ఠాకూర్ వెల్లడించారు.






