ఇంటెల్ చరిత్రలోనే తొలిసారి!
ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారి కంపెనీ ఇంటెల్ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. తొలగింపు వేల సంఖ్యలో ఉండొచ్చని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. ఈ నెలలోనే ఉద్యోగుల తొలగింపు ఉండొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో దాదాపు 20 శాతం మంది సిబ్బందికి ఉద్వాసన పలికే అవకావం ఉంందని సమాచారం. దీనిపై స్పందించడానికి ఇంటెల్ నిరాకరించడం గమనార్హం. ప్రస్తుతం కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 1,13,700 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసీకంలో ఇంటెల్ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో వార్షిక విక్రయాలు, లాభాల అంచనాలను కంపెనీ కుదించింది.






