ఇన్ స్టాగ్రామ్ లో మరో కొత్త ఫీచర్

ప్రముఖ సామాజిక మాధ్యం ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఇకపై లైవ్‌స్ట్రీమ్‌ను కేవలం క్లోజ్ ఫ్రెండ్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. క్లోజ్ ఫ్రెండ్స్ ఆన్ లైవ్ పేరిట అందుబాటులోకి తెచ్చింది. క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో యూజర్లు తమకు కావాల్సిన వారిని జత చేయడం లేదా తొలగించేందుకు అనుమతి ఉంటుంది. ఇప్పటి వరకు ఇన్‌స్టా లైవవ్ ఫాలోవర్లందరికీ కనిపించేది. అకౌంట్ పబ్లిక్ అయితే, ఎవరైనా స్ట్రీమింగ్‌లో జాయిన్ అయ్యే వీలుండేది. కొత్త తీసుకొచ్చిన ఆప్షన్‌తో ఇకపై ఎవరు తమ లైవ్‌ను వీక్షించొచ్చో యూజర్లే నియంత్రిస్తారు. ఇన్‌స్టా వేదికపై సంభాషణల్లో మరింత గోప్యత తీసుకురావడంలో భాగంగానే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు మాతృసంస్థ మెటా వెల్లడిరచింది.