అతి త్వరలో ఇది తప్పనిసరి : ఇన్ఫోసిస్
ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఇన్ఫోసిస్ సిద్దమైంది. వారానికి మూడు రోజులు ఇకపై ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేయనుంది. ఈ మేరకు ఉద్యోగులకు ఆయా విభాగాధిపతులు ఇ-మెయిల్ చేసినట్లు సమాచారం. వారానికి మూడు రోజుల చొప్పున ఆఫీసుకు రావాలి. అతి త్వరలో ఇది తప్పనిసరి కానుంది అని ఇ`మెయిల్లో పేర్కొన్నట్లు తెలిసింది. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి దీన్నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు సమాచారం. ఉద్యోగులు కార్యాలయాలకు వస్తేనే ఉత్పాదకత పెరుగుతుందని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. దీనికి తోడు కొన్ని కార్యాలయాలు పూర్తిగా ఉద్యోగులు లేక ఖాళీగా కనిపిస్తుండడంపై ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో అర్హత కలిగిన ఉద్యోగులు నెలలో 9 రోజులు చొప్పున ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు ఉండేది. ఒకవేళ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే కొవిడ్‌కు ముందునాటి హాజరు విధానం తిరిగి అమల్లోకి రానుంది.






