విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కోరిన చోటుకే లగేజీ డెలివరీ
విమానయాన సంస్థ ఇండిగో డోర్ టూ డోర్ బ్యాగేజ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ప్రయాణికుల లగేజీని ఇంటి నుంచి విమానాశ్రయానికి, అలాగే విమానాశ్రయం నుంచి కస్టమర్ కోరిన చోటకు చేరుస్తారు. 6ఈబ్యాగ్పోర్ట్ పేరుతో ఈ సేవలను కార్టర్పోర్టర్ అనే కంపెనీ సహాయంతో ఢిల్లీ, హైదరాబాద్లో ఇండిగో అందుబాటులో తెచ్చింది. మలిదశలో కార్టర్పోర్టల్ అనే సంస్థతో కలిసి ముంబై, బెంగళూరు నగరాల్లోనూ ఈ సేవలు అందించనున్నట్లు వెల్లడించింది. ఒకసారి లగేజీ ట్రాన్స్ పర్ చేస్తే రూ.630 చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక, బ్యాగేజీకి రూ.5000 చొప్పున సర్వీసు ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది. విమానం దిగిన ప్రయాణికులకు వెంటనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. విమాన ప్రయాణానికి 24 గంటల ముందుగా ఈ సేవలు ప్రయాణికులకు లభిస్తాయి.






