భారత సంతతి చేతికి బ్రిటిష్ సూపర్ మార్కెట్
బ్రిటన్లోనూ భారత సంతతి ప్రజలు తమ వ్యాపార సత్తా చాటుతున్నారు. మొహిసిన్, జుబెర్ ఇసా అనే భారత సంతతి సోదరులు ఆ దేశానికి చెందిన ఏఎస్డీఏ అనే సూపర్ మార్కెట్ రిటైర్ వ్యాపార సంస్థ ఈక్విటీలో మెజారిటీ వాటా కొనుగోలు చేశారు. అమెరికా రిటైర్ వ్యాపార దిగ్గజం వాల్మార్ట్ నుంచి వీరు ఈ వాటా కొనుగోలు చేయడం విశేషం. దాదాపు 880 కోట్ల డాలర్ల విలువైన ఈ డీల్లో టీడీఆర్ క్యాపిటల్ అనే పీఈ సంస్థ కూడా కొంత పెట్టుబడి పెట్టింది. ఇసా సోదరులు ఇప్పటికే యూరో గ్యారేజీ పేరుతో బ్రిటన్లో పెట్రోలు బంకులు నిర్వహిస్తున్నారు. వీరి తల్లిదండ్రులు 1970వ దశకంలో గుజరాత్ నుంచి బ్రిటన్కు వలస వెళ్లారు.






