అమెరికాలో మనోళ్ల రాబడే ఎక్కువ…
ఇండియన్ అమెరికన్ కటుంబాలు ఏటా సగటున 1.20 లక్షల డాలర్లు (దాదాపు రూ.87 లక్షలు) సంపాదిస్తున్నాయని ఒక రిపోర్ట్ వెల్లడించింది. వైట్ అమెరికన్లతో పాటు, ఇతర దేశాల వారి ఆదాయం కంటే ఇది ఎక్కువని నేషనల్ కోలిషన్ ఫర్ ఆసియన్ పసిఫిక్ అమెరికన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. బర్మా కుటుంబాలు 45,348 డాలర్లు, ఆఫ్రికన్ అమెరికన్లు 41,511 డాలర్లు, లాటిన్ దేశాల నుంచి వచ్చిన కుటుంబాలు 51,404 డాలర్ల వరకు సంపాదిస్తున్నాయి. ఆసియన్ అమెరికన్, పసిఫిక్ ఐలాండర్ దేశాల వాసుల సంపాదనల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. ఆసియన్ల ఇన్కమ్ 87 వేల డాలర్లు. ఇది బ్లాక్పీపుల్ ఆదాయం (41 వేల డాలర్లు) కంటే రెట్టింపు కావడం గమనార్హం.






