పోటీపడి తగ్గించిన రష్యా, ఉక్రెయిన్

రష్యా-ఉక్రెయిన్ పోరాటం సన్‌ఫ్లవర్ ఆయిల్‌కీ విస్తరించింది. ఈ రెండు దేశాలు తమ సన్‌ఫ్లవర్ ఆయిల్ నిల్వలను వదిలించుకునేందుకు పోటీ పడి ధరలు తగ్గించాయి. ప్రస్తుతం టన్ను శుద్ధి చేయని సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని ఈ రెండు దేశాలు ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులతో కలిపి 940 డాలర్లకే ( సుమారు రూ.78.452) విక్రయిస్తున్నాయి. ఇదే సమయంలో టన్ను ముడి పామాయిల్ ధర 950 డాలర్లు పలుకుతోంది. బీమా, రవాణా ఖర్చులు దీనికి అదనం. సాధారణంగా ముడి సన్ ఫ్లవర్ ఆయిల్ ధర పామాయిల్ కంటే 100 డాలర్లు ఎక్కువగా ఉంటుంది.