America :భారత్‌ను కోరనున్న అమెరికా.. సుంకం లేకుండా!

అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు జరుగుతున్న సంగతి విదితమే. కార్లను (Cars)సుంకం లేకుండా భారత్‌లోకి దిగుమతి చేసుకోవాలని ఈ సందర్భంగా అమెరికా (America) కోరే అవకాశం ఉంది. భారత్ మాత్రం దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయకుండా క్రమంగా తగ్గించడంపై దృష్టి సారించే అవకాశం ఉంది. మన దేశంలో కార్ల దిగుమతి సుంకం 110 శాతంగా ఉండడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump), విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) విమర్శిస్తుండటం గమనార్హం.
భారత్‌లోకి అడుగు పెట్టేందుకు టెస్లా (Tesla) సన్నద్ధమైన తరుణంలో ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చల్లో వాహన టారిఫ్‌లూ ఉంటాయి. భారత్‌లోకి అడుపెట్టాలని చూస్తున్నా, అధిక దిగుమతి సుంకాల వల్ల టెస్లా వెనకడుగు వేస్తోంది. సుంకాలు తగ్గించాలనే మస్క్ డిమాండ్‌కు, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతు కూడా లభిస్తోంది. కార్ల టారిఫ్‌ల విషయంలో అమెరికా మాటలను భారత్ వింటోదని, పూర్తిగా తోసిపుచ్చలేదని కానీ దేశీయ పరిశ్రమ వర్గాలతో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.