విదేశాలకెళ్లే విద్యార్థుల కోసం సఫిరో కార్డు : ఐసీఐసీఐ బ్యాంక్

ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంకు కొత్తగా సఫిరో ఫారెక్స్ కార్డును ఆవిష్కరించింది. కోర్సు సంబంధ ఫీజులతో పాటు రోజువారీ ఖర్చులను కూడా నిర్వహించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని బ్యాంకు తెలిపింది. క్రాస్ కరెన్సీ మార్కప్ చార్జీల భారం లేకుండా 15 కరెన్సీలను ఇందులో లోడ్ చేసుకోవచ్చని, లావవాదేవీలూ జరపవచ్చని వివరించింది. వెల్కమ్ కిట్‌లో ప్రైమరీ, రిప్లేస్‌మెంట్ కార్డులని రెండు ఉంటాయి. ప్రైమరీ కార్డు దెబ్బతిన్నా లేదా పోయినా రిప్లేస్‌మెంట్ కార్డును డిజిటల్‌గా యాక్టివేట్ చేసుకోవచ్చు. విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు ఎక్కడనుంచైనా ఎప్పుడైనా తక్షణమే ఇందులోకి కరెన్సీని లోడ్ చేయొచ్చు.