Mukesh Ambani : ఆసియా కుబేరుడిగా మళ్లీ అంబానీయే

ఆసియా కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మరోసారి గుర్తింపు తెచ్చుకున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఆయన సంపద రూ.లక్ష కోట్ల మేర తరిగిపోయినప్పటికీ రూ.8,6 లక్షల కోట్ల నికర సంపదతో మొదటి స్థానాన్ని (First place) కాపాడుకున్నారు. కానీ, ప్రపంచ టాప్-10లో స్థానాన్ని కోల్పోయారు. ఇదే కాలంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అధానీ (Gautam Adhani) సంపద 13 శాతం పెరిగి (రూ. లక్ష కోట్లు) 8.4 లక్షల కోట్లుకు చేరుకోవడంతో ముకేశ్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంలో సంపదను ఎక్కువగా పెంచుకున్నది అదానీయే కావడం గమనర్హం.