ఫోర్బస్ జాబితాలో రవి శాంతనమ్ కు చోటు
ప్రపంచంలో అత్యంత ప్రభావిత సీఎంవో (చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్)ల ఫోర్బస్ జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవో రవి శాంతనమ్కు చోటు దక్కింది. ఈ జాబితాలో ఆయన 39వ స్థానంలో నిలిచారు. యాపిల్, బీఎండబ్ల్యూ, లెగో, అడోబ్, మైక్రోసాఫ్ట్, పీఅండ్‌జీ వంటి దగ్గజ కంపెనీల సీఎంవోలు చోటు సంపాదించిన ఈ జాబితాలో ఒక భారతీయ కంపెనీ సీఎంవోగా చోటు దక్కించుకున్న ఒకే ఒక వ్యక్తి రవి శాంతనమ్ ఒక్కరే కావడం విశేషం. రీసెర్చ్ పార్టనర్స్ స్ప్రింక్లర్, లింక్డ్ఇన్తో కలిసి ఫోర్బస్ ఈ జాబితా ప్రకటించడం ఇది ఎనిమిదవసారి. ఈ ఏడాది మొత్తం 420 గ్లోబల్ సీఎంవోలను ఫోర్బస్ పరిశీలించింది. న్యూస్ రిపోర్టులు, వెబ్సైట్లు, సోషల్ నెట్వర్కుల డేటా ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయించింది. వ్యక్తిగత, కస్టమర్ అనుభూతికి రవిశాంతనన్ ప్రాధాన్యత ఇస్తారని, మార్కెటర్లకు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఎంతో కీలకమైనవని ఫోర్బస్ పేర్కొంది.






