హెచ్డీఎఫ్సీ ఉద్యోగులకు శుభవార్త..
లక్ష మంది బ్యాంకు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల వ్యాక్సినేషన్‌ను స్పాన్సర్ చేస్తామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులకు కొవిడ్ 19 వ్యాక్సిన్ రెండు డోసుల వ్యయాన్ని రీఎంబర్స్ చేస్తామని సంస్థ స్పష్టం చేసింది. తమ బ్యాంకులు, బ్రాంచ్ కార్యాలయాల్లో ఉద్యోగులు, కస్టమర్లకు సురిక్షిత వాతావరణం కల్పించే దిశగా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తామని, ఉద్యోగులు వారిపై ఆధారపడిన వారి వ్యాక్సినేషన్ వ్యయాన్ని భరిస్తామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. తమ ఉద్యోగుల సేవలకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్ఆర్ చీఫ్ వినయ్ రజ్డాన్ వెల్లడించారు.
తమ సంస్థలో ఉద్యోగులు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది వంటి వారని లాక్డౌన్ సమయంలోనూ కస్టమర్లకు వారు బ్యాంకింగ్ సదుపాయాలను అందుబాటులో ఉండేలా వ్యవహరించారని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రూప్ హెడ్ అషిమా భట్ అన్నారు. తమ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, భద్రత కోసం వారికి కొవిడ్ 19 వ్యాక్సిన్ వ్యయాన్ని భరించేందుకు సిద్ధమయ్యాయమని చెప్పారు.






