గ్రాన్యూల్స్ ఇండియా ఔషధానికి యూఎస్ లో అనుమతి
డెక్స్మైథైల్ఫెనిడేట్ హెచ్‌సీఎల్ ఎక్స్టెండెడ్ రిలీజ్ క్యాప్సూల్స్‌ను అమెరికా మార్కెట్లో విక్రయించటానికి గ్రాన్యూల్స్ ఇండియాకు అనుమతి లభించింది. ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిషిట్ హైపరాక్టివిటీ డిసార్డర్) వ్యాధిని అదుపు చేయటానికి ఈ మందు వినియోగిస్తారు. నొవార్టిస్ ఏజీకి చెందిన ఫొకాలిన్ ఎక్స్ఆర్ అనే బ్రాండుకు ఇది జనరిక్ ఔషధం. అమెరికాలోని తన సబ్సిడరీ కంపెనీ ద్వారా ఈ ఔషధాన్ని విక్రయించటానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి తీసుకున్నట్లు, ఈ ఔషధాన్ని వర్జీనియాలోని తన సబ్సిడరీ సంస్థకు చెందిన ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది. ఇక్వియా సంస్థ గణాంకాల ప్రకారం యూఎస్‌లో గత ఏడాది కాలంలో ఈ ఔషధం 556 మిలియన్ డాలర్ల అమ్మకాలను నమోదు చేసింది.






