గ్రాన్యూల్స్ ఔషధానికి అమెరికాలో అనుమతి

గ్రాన్యుల్స్ ఇండియా అమెరికాలో కోల్చిసిన్ క్యాప్సూల్స్ (0.6 ఎంజీ) అనే ఔషధాన్ని విడుదల చేయడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి అనుమతి సంపాదించింది. ఇది హిక్మా ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ఎల్‌ఎల్‌సీ అనే సంస్థకు చెందిన మిటిగేట్ క్యాపూల్స్ (0.6 ఎంజీ)కి సమానమైన మందు. దీన్ని గౌట్ వ్యాధిలో కొన్ని లక్షణాల నివారణకు వినియోగిస్తున్నారు. అమెరికాలో ఈ మందుకు ఏటా 55 మిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. యూఎస్‌లోని తన అనుబంధ సంస్థ గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్, ద్వారా ఈ మందును విక్రయించడానికి గ్రాన్యూల్స్ ఇండియా సన్నద్దమవుతోంది.