గూగుల్‌కు షాక్.. సేన్‌గుప్తా గుడ్ బై
అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సీజర్ సేన్‌గుప్తా ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయబోతున్నారు. గూగుల్‌కు 15 ఏండ్లపాటు సేవలందించిన సేన్‌గుప్తా.. ఆ కంపెనీకి చెందిన క్రోమ్ ఓఎస్, నెక్స్ బిలియన్ యూజర్స్, గూగుల్ పే లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ప్రారంభం, వాటి అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించారు. ప్రస్తుతం గూగుల్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న సేన్‌గుప్తా.. ఏప్రిల్ 30న ఆ పదవులు నుంచి వైదొలిగి సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని వ్యక్తిగతంగా నిశ్చయించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. సేన్‌గుప్తా చేపట్టే కొత్త వ్యాపారం ఏమిటన్నదీ తెలుసుకునేనేందుకు ఆసక్తితో ఎదురు చేస్తున్నామని, ఆయన కొత్త ప్రయాణం విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తున్నామని గూగుల్ తెలిపింది.






