వర్క్ ఫ్రమ్ హోమ్ తో గూగుల్ కు… రూ.7,500 కోట్లు

కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా తమకు ఏడాది కాలంలో దాదాపు 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.7,500 కోట్లు) ఆదా అయిందని గూగుల్ తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం లో కంపెనీ ప్రచారం, ఉద్యోగుల ప్రయాణాలు, వినోద ఖర్చులపై 26.8 కోట్ల డాలర్లు ఆదా చేయగలిగినట్టు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వెల్లడించింది. ఈ లెక్కన ఏడాది పొడుగునా వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ కొనసాగితే, కంపెనీ ఖర్చు 100 కోట్ల డాలర్లకు పైగా తగ్గే అవకాశం ఉంది. గత ఏడాదిలో అడ్వర్టైజ్‍మెంట్, ప్రమోషన్స్ కోసం ఖర్చు 140 కోట్ల డాలర్లు తగ్గిందని ఆల్ఫాబెట్ తెలిపింది. ఖర్చు తగ్గించుకోవడం, వాయిదా వేయడంతో పాటు కేవలం డిజిట్ మాధ్యమంలోనే ప్రచారం చేయడం ఇందుకు కారణమని కంపెనీ స్పష్టం చేసింది. ప్రయాణ, వినోద వ్యయాలనూ 37.1 కోట్ల డాలర్ల మేర తగ్గించుకోగలిగామని కంపెనీ పేర్కొంది.