గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు
డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎంను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకే పేటీఎం యాప్ను ప్లేస్టోర్ నుంచి తొలగించినట్టు గూగుల్ సృష్టం చేసింది. దీనిపై గూగుల్ గతంలోనే పేటీఎంకు నోటీసులు జారీ చేసింది. క్యాసినోస్, గ్యాంబ్లింగ్ మనీ ప్రమోషన్లు తమ నిబంధనలకు విరుద్ధమని గూగుల్ పేర్కొంది. పేటీఎం పదేపదే ఈ నిబంధనలను అతిక్రమించిందని గూగుల్ వెల్లడించింది ఇక పేటీఎం మనీ, పేటీఎం మాల్, పేటీఎం బిజినెస్ యాప్లు మాత్రం ప్లేస్టోర్లో యాథావిథిగా అందుబాటులో ఉండగా పేటీఎం యాప్ కనిపించలేదు. మరోవైపు ఈ వ్యవహారంపై పేటీఎం ఇప్పటివరకూ స్పందించలేదు.






