గూగుల్ ఈ సర్వీస్ ను ఆపేస్తోంది…
ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వాడుతున్న కస్టమర్లకు గూగుల్ ఈ మధ్య కొన్ని రిమైండర్లు పంపిస్తోంది. తమ ప్రముఖ సర్వీసు ప్లే మ్యూజిక్‌ను ఈ నెల 24న డిలీట్ చేయబోతున్నామన్నది ఆ రిమైండర్ సారాంశం. అందులో భాగంగా గూగుల్ ప్లే మ్యూజిక్‌లో ఉన్న లైబ్రరీ, డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తామని గూగుల్ తెలిపింది. ఒకసారి ఈ డేటా డిలీట్ చేసిన తర్వాత మళ్లీ రికవర్ చేయడానికి వీలుపడదని కూడా తేల్చి చెప్పింది. ఇప్పటికే యూజర్లను ప్లే మ్యూజిక్ నుంచి యూట్యూబ్ మ్యూజిక్కు ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా గూగుల్ వెల్లడించింది.
ఒకవేళ మీరు ఏమైనా మార్పులు చేసి ఉంటే.. ఇప్పటికీ వాటిని ట్రాన్ష్‌ఫర్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఒకవేళ మీరు గూగుల్ ప్లే మ్యూజిక్ లైబ్రరీ, డేటాను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 24లోపు గూగుల్ టేక్ అవుట్ నుంచి చేసుకోవచ్చని కూడా గూగుల్ చెప్పింది. గతేడాది డిసెంబర్లోనే గూగుల్ ప్లే మ్యూజిక్ ఆపరేషన్లను నిలిపేసింది. దానిని యూట్యూబ్ మ్యూజిక్‌గా మార్చింది.






