8.13 లక్షల యాప్‌లపై నిషేధం
8 లక్షల యాప్‌లపై గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నిషేధం విధించాయి. హెచ్ 1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్ పేరిట పిక్సలేట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆ రెండు సంస్థలు 8.13 లక్షల యాప్ లపై నిషేధం విధించాయి. అందులో 86 శాతం యాప్‌లు 12 ఏళ్ల లోపు చిన్నారులను ప్రభావితం చేసే యాప్ లే ఉన్నాయని నివేదిక పేర్కొంది. అందులో ప్లే స్టోర్‌లోని 86 శాతం, యాప్ స్టోర్ లోని 89 శాతం యాప్ లు పిల్లలను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. యాప్ స్టోర్ విధానాలను ఉల్లంఘించడం లేదా డెవలపర్ విత్ డ్రా కావడం వంటి కారణాలే యాప్ ల నిషేధానికి కారణమై ఉంటుందని పిక్సలేట్ పేర్కొంది. అందులో గూగుల్ ప్లే స్టోర్ లోని 25 శాతం, యాపిల్ లోని 59 శాతం యాప్‌లు సంస్థల పాలసీలను ఉల్లంఘించాయని వెల్లడిరచింది. డీలిస్ట్ చేసిన యాప్‌లలో 26 శాతం రష్యాకు చెందినవని, అవన్నీ పాలసీలను ఏ మాత్రం పాటించట్లేదని నివేదిక చెప్పింది. చైనాకు చెందిన 60 శాతం యాప్‌లు గోప్యతా నిబంధనలను పాటించట్లేదని పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్ డీ లిస్ట్ చేసిన యాప్ లలో 66 శాతం యాప్‌లు ప్రమాదకరమైన పర్మిషన్లను అడుగుతున్నాయని నివేదిక హెచ్చరించింది.






