గూగుల్ కొత్త రూల్…జూన్ 1 నుంచి

గూగుల్ ఫొటోస్ వినియోగదారులు అతి త్వరలోనే ఉచితంగా అన్‍లిమిటెడ్ స్టోరేజీకి దూరమవనున్నారు. గూగుల్ ఫొటోస్ క్లౌడ్ స్టోరేజీ బ్యాకప్, ఉచితంగా అన్‍లిమిటెడ్ స్టోరేజీకి ఈ నెల చివరి నుంచి శుభం కార్డు పడనున్నట్టు గూగుల్ వెల్లడించింది. జూన్ 1, 2021 నుంచి వినియోగదారులు తమ ఫొటోలను స్టోర్ చేసుకునేందుకు తమకు కేటాయించిన డిఫాల్ట్ ఉచిత 15 జీబీ స్టోరేజీని మేనేజ్ చేసుకోవాలి లేదా అదనపు స్టోరేజీ కోసం గూగుల్‍కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ వన్ సబ్‍స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫొటోల స్టోరేజీ ఇకపై లెక్కించబడుతుంది.
గూగుల్ ఫొటోస్ స్టోరేజీ కోసం చెల్లింపులకు తగిన సమయం ఇస్తాం. ఇప్పటికే గూగుల్ ఫొటోస్‍లోకి అప్‍లోడ్ చేసిన ఫొటోలను డౌన్‍లోడ్ చేసుకోవాలని సూచించింది. గూగుల్ మార్పులు చేస్తుంది కాబట్టి ఎలాంటి విలువైన జ్ఞాపకాలను కోల్పోవద్దని వినియోగదారులకు గూగుల్ సూచించింది. వాస్తవానికి ఉచితంగా అన్‍లిమిటెడ్ ఫొటోస్ స్టోరేజీకి ముగింపు పలకనున్నామని గతేడాదే గూగుల్ ప్రకటించింది.