గూగుల్ లే ఆఫ్.. భార్యాభర్తలిద్దరికీ ఒకేసారి
ఐటీ రంగంలో ఉద్యోగులు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఎప్పుడు లేఆఫ్ వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ టెక్ సంస్థలన్నీ భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఒక మెయిల్ చేసి, ఉద్యోగం నుంచి తీసేసినట్లు సమాచారం ఇస్తున్నాయి. తాజాగా గూగుల్ ఓ జంటకు షాకిచ్చింది. భార్యభర్తలిద్దరినీ ఒకేసారి ఉద్యోగం నుంచి తొలగించింది. సంస్థలో వేర్వేరు హోదాల్లో పనిచేస్తున్న కాలిఫోర్నియాలోని ఈ జంటకు నాలుగు నెలల చిన్నారి ఉంది. బిడ్డ కోసం మరికొంత కాలం సెలవులు పెడదామనుకుంటున్న వారికి లేఆఫ్ రూపంలో ఈ ఊహించని షాక్ తగిలింది. వారిలో ఒకరు ఆరు సంవత్సరాలుగా సంస్థలో పనిచేస్తుండగా, మరొకరు నాలుగేళ్ల క్రితమే చేరారు.






