ఉద్యోగులకు సుందర్ పిచాయ్ షాక్!
గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వేతన కోతకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల గూగుల్ ఉద్యోగులతో జరిగిన టౌన్ హాల్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగుల వార్షిక బోనస్లో గణనీయమైన కోత ఉంటుందని తెలిపారు. అయితే ఎంత మేరక వేతన కోత ఉంటుందో లేదా ఎంత కాలం కొనసాగుతుందన్న అంశాలను పిచాయ్ ప్రస్తావించలేదు. కంపెనీ పనితీరుకు ఆయన పారితోషికం అనుసంధానమైన ఉండటంతో పిచాయ్ కూడా వేతనంతో కోత విధించుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.






