Godrej Jersey: గోద్రేజ్ జెర్సీ నుంచి హై ప్రోటీన్ పనీర్.. ప్రొటీన్ లోపాన్ని అధిగమించడమే ధ్యేయం
హైదరాబాద్: భారత్‌లో పెరుగుతున్న ప్రోటీన్ లోపాన్ని దృష్టిలో ఉంచుకుని, గోద్రేజ్ జెర్సీ సంస్థ ఒక వినూత్నమైన అడుగు వేసింది. తన ‘హై ప్రోటీన్ పనీర్’ను కేవలం రూ. 99 కే విడుదల చేస్తూ సామాన్యులకు సైతం పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. పాలతో తయారైన ఈ పనీర్ ప్యాక్ ద్వారా 30 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఇది మృదువైన ఆకృతితో పాటు అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. మార్కెట్లో ప్రముఖ కంపెనీలు పనీర్‌ను రూ.135 వరకు విక్రయిస్తుండగా, గోద్రేజ్ జెర్సీ అంతకంటే 25% తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్నట్లు చెప్పింది. ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ గణాంకాల ప్రకారం, 73 శాతం మంది భారతీయులు రోజువారీ అవసరమైన ప్రోటీన్ తీసుకోవడం లేదు. కండరాల బలం, రోగనిరోధక శక్తికి ప్రోటీన్ ఎంతో ముఖ్యం. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలో ప్రోటీన్ అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది. దక్షిణ భారతదేశంలో పనీర్‌ను అప్పుడప్పుడు వాడే పదార్థంగా కాకుండా, రోజూ తినే ఆరోగ్యకరమైన ఆహారంగా మార్చాలని గోద్రేజ్ జెర్సీ భావిస్తోంది.
పనీర్‌ని ఇష్టపడేవారెందరో..
గోద్రేజ్ జెర్సీ మార్కెటింగ్ హెడ్ శాంతను రాజ్ మాట్లాడుతూ, “ప్రోటీన్ పరివర్తనకు కేంద్రంగా భారత్ ఉంది. కుటుంబాలు తమ రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చుకోవడానికి పాల ఉత్పత్తులు సులభమైన, అత్యంత విశ్వసనీయ మార్గంగా మారుతున్నాయి. గోద్రేజ్ జెర్సీ ఇండియా లాక్టోగ్రాఫ్ ఫైండింగ్స్ ఆర్థిక సంవత్సరం 25-26′ అధ్యయనం ప్రకారం 76% కుటుంబాలు పనీర్‌ను ఇష్టపడుతుండటంతో, రూ. 99 ధరకు మా హై ప్రోటీన్ పనీర్ నిజమైన పాలు, ఉన్నతమైన మృదుత్వం, ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే ఫార్మాట్లో 30 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలోని టైర్-2, టైర్-3 వినియోగదారులు సరసమైన, అలవాటుపడిన ప్రోటీన్‌ను కోరుకుంటున్నారు. ప్రీమియం పోషకాహారం విలాసవంతమైనదిగా ఉండకూడదని మేము కోరుకుంటున్నాము. ఈ ఆవిష్కరణ ప్రాంతీయ మార్కెట్లలో జెర్సీ బలాన్ని , పాల ఉత్పత్తులలో అత్యంత అందుబాటులో , వ్యాప్తి చేయగల ప్రోటీన్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించడంపై మా లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నారు.






