ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్లీ అదానీకి స్థానం
ఈ ఏడాది ఆరంభంలో హిండెన్ బర్గ్ దెబ్బకు కుదేలైన అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ తిరిగినప్పుడు పుంజుకుంటున్నారు. ఈ క్రమంలోనే బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్-15 బిలియనీర్ల జాబితాలో మళ్లీ అదానీ చోటు దక్కించుకున్నారు. తాజాగా విడుదలైన లిస్టులో 82.50 బిలియన్ డాలర్ల సంపదతో 15వ స్థానంలో నిలిచారు. 91.4 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. అయితే ఇటు భారత్లో అటు ఆసియాలో ముకేశ్, అదానీలే ప్రస్తుతం అత్యంత ధనవంతులుగా ఉండటం విశేషం. తొలి రెండు స్థానాల్లో ఉన్న ఇరువురికి మధ్య 8.9 బిలియన్ డాలర్ల సంపదే వ్యత్యాసంగా ఉండటం గమనార్హం..






