అదానీ కి షాక్… కుబేరుల జాబితాల నుంచి ఔట్
హిండెన్‌బర్గ్ దెబ్బకు అదానీ కుబేరుల జాబితాలో టాప్ 10 నుంచి బయటకు వచ్చారు. ఈ నివేదికకు ముందు ఆయన టాప్ 3లో తరుఆవత టాప్ 4లో ఉన్నారు. నివేదిక వెలువడిన నాటి నుంచి వరసగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. మూడు ట్రేడిరగ్ సెషన్లలో అదానీ 34 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. ప్రస్తుతం ఆయన 84.4 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో ఉన్నారు. 10వ స్థానంలో 82.2 బిలియన్ డాలర్లతో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఉన్నారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ మూడు రోజుల్లో 68 బిలియన్ డాలర్ల సంపద అవిరైంది. హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావంతో అదానీ కంపెనీల షేర్ల పతనం కొనసాగింది. నాలుగు ట్రేడిరగ్ సెషన్స్‌లో అదానీ టోటల్ గ్యాస్ విలువ 45 శాతం తగ్గింది. గ్రీన్ ఎనర్జీ విలువ 38 శాతం తగ్గింది. అదానీ టోటల్ ట్రాన్స్మిషన్ 36.9 శాతం పోర్ట్స్ 19.5 శాతం, అదానీ విల్మర్ 18 శాతం, అదానీ పవర్ 18.5 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 13 శాతం పతనమయ్యాయి.






