ఫోర్బ్స్ ఆసియా జాబితాలో .. ముగ్గురు భారతీయులు
అంతర్జాతీయ ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఆసియా శక్తిమంతమైన మహిళా జాబితాల్లో భారత్ నుంచి ముగ్గురికి చోటు లభించింది. మూడేండ్లుగా కరోనాతో కుదేలైన వ్యాపారం వారు తీసుకున్న చర్యలతో తిరిగి పుంజుకున్న వారితో ఫోర్బ్స్ తాజాగా 20 మంది మహిళా వ్యాపార వేత్తలతో ఒక జాబితాను రూపొందించింది. వీరిలో భారత్ నుంచి స్టీల్ అథార్టీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మండల్, ఎమక్యూర్ ఫార్మా ఇండియా బిజినెస్ ఈడీ నమితా తపార్, హోనసా కన్జ్యూమర్ కో `ఫౌండర్, చీఫ్ ఇన్నోవేషన్ అధికారి ఘజల్ అలాగ్ ఉన్నారు. పలువురు మహిళా వ్యాపారవేత్తలు, షిప్పింగ్, ప్రాపర్టీ, నిర్మాణ రంగాలతో పాటు టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, కమోడిటీ రంగాల్లో కూడా సేవలు అందిస్తున్నారు.






