ఆ విమాన టికెట్లకు తక్షణమే పూర్తిగా రిఫండ్
కొవిడ్ 19 లాక్డౌన్ కాలంలో దేశీయ లేదా అంతర్జాతీయ ప్రయాణాల కోసం బుక్ చేసుకున్న టికెట్లకు ఎయిర్‌లైన్స్ కంపెనీలు తక్షణమే పూర్తిగా రిఫండ్ చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆపిడవిట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రతిపాదించింది. మార్చి 25 నుంచి మే 3 మధ్య కాలంలో బుక్ చేసుకున్న టికెట్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. మార్చి 25 కన్నా ముందు బుక్ చేసుకున్న టికెట్లకు సంబంధించిన రిఫండ్‌ను 15 రోజుల్లో ప్రయాణికులకు చెల్లించాల్సి ఉంటుదని పేర్కొంది. ఆర్థికపరమైన ఒత్తిడులు ఉండి రిఫండ్ చేయలేని పరిస్థితి ఉంటే నిర్ధేశిత మొత్తానికి క్రెడిట్ షెల్ సదుపాయం ఎయిర్‌లైన్స్ కంపెనీలు కల్పిస్తాయని దీన్ని 2021 మార్చి 31 వరకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.






