Shamshabad :శంషాబాద్- వియత్నాం కొత్త విమాన సర్వీసు

శంషాబాద్ (Shamshabad) ఎయిర్ పోర్టు నుంచి నేరుగా వియత్నాం (Vietnam) లోని హోచిమిన్ నగరానికి కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. వియెట్‌జెట్ అందిస్తున్న ఈ సేవలను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జీహెచ్‌ఐఎల్ (GHIL) ఉన్నతాధికారులు, భాగస్వాములు హాజరయ్యారు. మంగళ(Tuesday), గురువారాల్లో(Thursday) ఈ విమాన సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఈ విమానం 4:35 గంటల్లో భారతదేశం నుంచి వియత్నాం చేరుతుంది.