ఫెడ్ రేట్లు యథాతథం

వరుసగా ఆరో సమీక్షలోనూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 5.25`5.50 శాతంగా కొనసాగించింది. ద్రవ్యోల్బణ తాజా గణాంకాలు అంచనాలకు మించి 3.7 శాతంగా నమోదు కావడమే ఇందుకు నేపథ్యం. 2022 మార్చి తర్వాత విధాన రేటును 11 సార్లు పెంచుతూ 5.25 శాతానికి చేర్చిన ఫెడ్, 2023 జులై నుంచి యధాతధంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లోపునకు తీసుకురావాలన్నది ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎమ్‌సీ) లక్ష్యం. ఆర్థిక భవిష్యత్ అంచనాలు అనిశ్చితిగా ఉన్నందున, రేట్లను యధాతథంగా కొనసాగించేందుకే కమిటి మొగ్గు చూపింది.