ఫెడ్ కీలక రేట్లు మరింత పెంచే అవకాశం
ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరులో అమెరికాలో నియామకాలు తగ్గాయి. అయితే 2,63,000 మందికి కంపెనీలు ఉద్యోగాలు కల్పించాయి. సంఖ్యాపరంగా నియామకాలు ఎక్కువగానే ఉండటం వల్ల ద్రవ్యోల్బణంపై పోరాటాన్ని కొనసాగించేందుకు మున్ముందు కూడా అమెరికా కేంద్రబ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కీలక రేట్లను మరింత పెంచేందుకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో 3,15,000 నియమకాలు జరిగితే, ఈ సంఖ్య సెప్టెంబరులో 2.63 లక్షలుగా ఉంది. 2021 ఏప్రిల్ తర్వాత నెలవారీ వృద్ధిపరంగా ఇవి తక్కువే. అయితే నిరుద్యోగిత రేటు 3.7 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింది. ఇది అర్థ శతాబ్దపు కనిష్ఠ స్థాయి.






