ట్విట్టర్ బాటలోనే మెటా
ఫేస్బుక్ మాతృసంస్థ మెటాలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కోతలు వేల సంఖ్యలోనే ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. నవంబర్ 9వ తేదీన ఈ అంశంపై మెటా నుంచి ప్రకటన వెలువడవచ్చని ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పినట్లు తెలిసింది. సెప్టెంబర్ 30వ తేదీ నాటి గణాంకాల ప్రకారం ప్రస్తుతం మెటాలో ప్రపంచ వ్యాప్తంగా 87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మూడో త్రైమాసిక ఫలితాల్లో మెటా వాటాదారులను నిరాశపర్చింది. ఈ సందర్భంగా సీఈవో మార్క్ జుకర్బర్గ్ మాట్లాడుతూ 2023 వరకు ఉద్యోగుల సంఖ్యను పెంచబోమని, స్వల్పంగా తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి పరిశ్రమలో ఇతర టెక్ సంస్థలు అనుసరిస్తున్నట్లే నియామకాలు తగ్గించుకోవడమో, లేదా ఉద్యోగుల సంఖ్యలో కోత విధించుకోవడమే చేయవచ్చు.






