భారత్ కు చెందిన ఎజ్రీకేర్ వద్దు.. అమెరికా హెచ్చరిక
భారత దేశానికి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన ఎజ్రీకేర్ కంటి చుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని, దీని వల్ల 12 రాష్ట్రాల్లో 55 మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆ దేశ ప్రజలను అమెరికా హెచ్చరించింది. దీనికి సంబంధించి వైద్యులను ది సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అప్రమత్తం చేసింది. న్యూయార్క్, వాషింగ్టన్‌తో పాటు మరో 19 రాష్ట్రాల్లో పలువురు కంటి చుక్కలు వేసుకున్న తర్వాత బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, రక్తం, మూత్రంలో ఇన్ఫెక్షన్ కనిపించింది. దీనిపై వినియోగదారులను సైతం అప్రమత్తం చేస్తున్నాం అని తెలిపింది. రెండు వారాల క్రితం కూడా సీడీసీ ఇదే హెచ్చరికలు చేసింది.






