ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ కు.. త్వరలోనే

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ సంపద త్వరలోనే మరింతగా పెరగవచ్చు. ఎందుకంటే అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా మస్క్‌కు 56 బిలియన్ డాలర్లు (రూ.4.68 లక్షల కోట్లు) వేతనం ఇవ్వనుంది. ఆయనకు ఇంత భారీ మొత్తంలో వేత్తనం చెల్లించేందుకు టెస్లా వాటాదారులు అంగీకరించారు. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ టెస్లా నుండి 56 బిలియన్ డాలర్ల ప్యాకేజీని పొందే మార్గంలో మరో అడ్డంకి తొలగిపోయింది. ఇటీవల జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ పెట్టుబడిదారులు ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన పే ప్యాకేజీకి అనుకూలంగా ఓటు వేశారు. టెస్లా వాటాదారుల వార్షిక సాధారణ సమావేశం జూన్ 13న జరిగింది. ఎలాన్ మస్క్ పే ప్యాకేజీ ప్రతిపాదన ఎజీఎంలో వాటాదారులు ముందు వచ్చింది. వారు దానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇది కాకుండా, కంపెనీ రిజిస్ట్రేషన్‌ను టెక్సాస్‌కు మార్చే ప్రతిపాదనను కూడా వాటాదారులు ఆమోదించారు.