అలా చేస్తే మా కంపెనీలో.. యాపిల్ పరికరాల పై నిషేధం

యాపిల్ పరికరాలను ఏఐ రూపొందించిన కృత్రిమ మేధను అనుసంధానిస్తే తమ కంపెనీలో వాటిని నిషేధిస్తామని టెస్లా (సీఈఓ) ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ యాపిల్ తాజాగా వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ను నిర్వహించింది. ఈ వార్షిక సమావేశంలో సంస్థ తమ ఉత్పత్తులకు తీసుకురానున్న అప్‌గ్రేడ్‌లను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఐఓఎస్ 18 సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లో కృత్రిమ మేధను జోడిస్తున్నట్లు వెల్లడిరచింది. యాపిల్ చాట్‌బాట్ పరికరాల్లో చాట్‌జీపీటీని అనుసంధానించడానికి ఓపెన్ ఏఐ తో ఒప్పందం చేసుకుంటామని వెల్లడిరచింది. ఎలాన్ మస్క్ దీనిపై స్పందిస్తూ ఐఫోన్ ఓఎస్ కి ఓపెన్ ఏఐను అనుసంధానిస్తే తన కంపెనీ పరికరాలను ఇకపై అనుమతించబోమని పేర్కొన్నారు. ఇటువంటి స్పైవేర్‌ను ఆపేయకపోతే తమ కంపెనీల్లో అన్ని యాపిల్ పరికరాల పైన నిషేధం విధిస్తామని తెలిపారు. సంస్థలో యాపిల్‌కు సంబంధించిన పరికరాలను ఇకపై ఉపయోగించమన్నారు.