టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు షాక్…ప్రపంచ కుబేరుల్లో

ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయారు ఎలెక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఆ స్థానంలోకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులు తయారు చేసే ఎల్‍వీఎంహెచ్ సంస్థ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ వచ్చారు. కాగా మొదటి స్థానంలో ఇప్పటికీ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‍నే ఉన్నారు. బ్లూమ్‍బర్గ్ బిలియనీర్ నివేదిక ప్రకారం జనవరిలో ప్రపంచ అపర కుబేరుడిగా మొదటి స్థానంలో వచ్చారు మాస్క్. అయితే కొద్ది రోజులకే మళ్లీ రెండవ స్థానంలోకి పడిపోయారు. జవనరి నుంచి నేటికి మస్క్ సంపాదనలో 24 శాతం తేడా ఉందని బ్లూమ్‍బర్గ్ బిలయనీర్ నివేదిక పేర్కొంది.
గత మార్చిలో కొద్దిరోజుల పాటు మస్క్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు కూడా. కాగా చైనాలో, ఆసియాలోని ఇతర భాగాల్లో లగ్జరీ గూడ్స్ దిగ్గజం లూయీ వ్యూటన్ అమ్మకాలు భారీగా పెరుగడంతో ఆ సంస్థ అధినేత ఆర్నాల్ట్ నికర ఆస్తి విలువ 4700 కోట్ల డాలర్లు పెరిగి 161.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మస్క్ సంపద కన్నా ఇది కొంచెమే ఎక్కువ. దాంతో ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుల్లో నంబర్ టూ స్థానాన్ని దక్కించుకున్నారు.