మళ్లీ మస్కే నంబర్ వన్.. ప్రపంచ కుబేరుల జాబితాలో

ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మళ్లీ తొలి స్థానానికి చేరుకున్నారు. 208 బిలియన్ డాలర్ల నికర విలువతో బెజోస్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నారు. 205 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ 199 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్డ్ తర్వాతి స్థానంలో నిలిచారు. చాలా కాలం నుంచి ఈ ముగ్గురి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. తాజాగా టెస్లా షేర్లు రాణించడంతో మస్క్ తిరిగి మొదటి స్థానంలో నిలిచారు.