ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు షాక్
ట్విటర్ కొత్త యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 4 బిలయన్ డాలర్ల విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించారు. ఆగస్టు నెలలో ఆయన 7 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. ట్విటర్ కొనుగోలు అవసరమైన నిధుల కోసం ఆయన షేర్లను విక్రయిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 19 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను విక్రయించారు. దీంతో స్టాక్ మార్కెట్లో టెస్లా షేర్ల ధరలు భారీగా పతనం అయ్యాయి. ఫలితంగా మస్క్ సంపద 200 బిలియన్ డాలర్లకు దిగువకు చేరింది. ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఆయన సొంతంగా 15.5 బిలియన్ డాలర్లు చెల్లిస్తానని ఒప్పందంలో పేర్కొన్నారు. దీనింతో ఆయనపై భారం పడిరది.






